![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -1000 లో.. ఇక డబ్బులు కట్టలేరని అర్థం అయింది. కాలేజీనీ మాకు ఇవ్వండి అని ఫైనాన్సియర్ అంటాడు. ఇప్పుడు వాళ్ళు నేను చెప్తే వినే స్టేజీలో లేరని వసుధార వాళ్ళతో మినిస్టర్ చెప్తాడు. ఇక మీరు ఈ డాకుమెంట్స్ పై సంతకం చెయ్యండి అని వాళ్ళు బోర్డు మెంబర్స్ కి ఇస్తారు. కాలేజీనీ వదులుకోవాల్సిందేనా అని బోర్డు మెంబర్స్ అంటారు. ఇక ఇప్పుడు ఏం చెయ్యలేం సంతకాలు పెట్టండి అని మహేంద్ర వాళ్ళకి చెప్తాడు..
ఆ తర్వాత ఒక్కొక్కరుగా డాకుమెంట్స్ పై సంతకాలు పెడుతుంటారు. ఇక శైలేంద్ర వంతు వచ్చేసరికి నా తమ్ముడు విస్తరించిన సామ్రాజ్యం వదులుకోవాల్సి వస్తుందని బాధపడుతున్నట్లు శైలెంద్ర యాక్టింగ్ చేస్తు సంతకం పెడతాడు.. అ తర్వాత వసుధార వంతు కాగా తను బాధపడుతూ ఉంటుంది. మరొకవైపు రాజీవ్ కాలేజీ ముందే ఉండి లోపల కాలేజీ వాళ్ళ సొంతం కాగానే వసుధారని తీసుకొని వెళ్ళాలని వెయిట్ చేస్తుంటాడు. అప్పుడే కాలేజీలోకి ఒకతను వెళ్లడం చూసి వీడిడేంటి లోపలికి వెళ్తున్నాడని రాజీవ్ అనుకుంటాడు. మరొకవైపు వసుధార సంతకం చెయ్యబోతుంటే ఆ అజ్ఞాత వ్యక్తి వెళ్లి ఆపుతాడు. అతన్ని చూసి అనుపమ టెన్షన్ పడుతుంది. మీకు ఎంత డబ్బులు కావాలి నేను ఇస్తానని అనగానే అందరూ షాక్ అవుతారు. మీరు ఎవరని ఫైనాన్సియర్స్ అడుగుతాడు. నేను ఎవరో కావాలా మీ ప్రాబ్లెమ్ సాల్వ్ కావాలా అని అడుగుతాడు. ఎవరు నువ్వు ప్రతి సారీ.. లాస్ట్ మినిట్ లో ఎవరో ఒకరు వచ్చి ఇలా డబ్బులు ఇస్తారు. అప్పట్లో మురుగన్.. ఇప్పుడు నువ్వా అని శైలేంద్ర ఫ్రస్ట్రేషన్ అవుతుంటే.. కాలేజీ వాళ్ళు తీసుకొవడం మీకు ఇష్టంలా ఉందని అతను అనగానే.. అదేం లేదు మళ్ళీ మీరు కూడా కొన్ని రోజులకి ఇలాగే కాలేజీ అంటూ వస్తారని అనుకున్నానని శైలేంద్ర కవర్ చేస్తాడు.
అ తర్వాత వాళ్లకి చెక్కు ఇచ్చి పంపిస్తాడు. కాలేజీని బాగా చూసుకోండి అంటు చెప్పేసి మినిస్టర్ వెళ్ళిపోతాడు. ఆ తర్వాత అ అజ్ఞాత వ్యక్తి.. అనుపమ మహేంద్ర వసుధారలు తన క్యాబిన్ లో మాట్లాడుకుంటారు. ఎవరు మీరు? ఎందుకు ఇదంతా చేస్తున్నారని వసుధార అడుగుతుంది. నేను ఒక సాటి మనిషిగా చేసాను అంతే.. మీరు ఉన్నప్పుడు డబ్బులు ఇవ్వండి అని ఆ అజ్ఞాతవ్యక్తి చెప్పి.. నా పేరు మను అని చెప్తాడు. కాసేపటికి వసుధార బ్రాస్ లైట్ చూసి.. ఏంటని మను అడుగుతాడు. ఇది నా భర్తది.. ఎప్పుడు నా పక్కనే ఉన్నాడని ఫీల్ అవుతానని వసుధార చెప్తుంది. ఆ తర్వాత మను వెళ్తూ అనుపమ వంక అదోలా చూస్తూ వెళ్తాడు. కాసేపటికి అనుపమ వాళ్ళ పెద్దమ్మకి ఫోన్ చేసి.. ఏంటి నేను చెప్పిన ప్రాబ్లమ్ గురించి మనుకి చెప్పావా అని అడుగుతుంది. చెప్పాను.. అయితే ఏంటి? మీ ప్రాబ్లమ్ అయితే సాల్వ్ అయింది కదా అని వాళ్ళ పెద్దమ్మ అంటుంది. ఎందుకు చెప్పావ్ అసలు ప్రాబ్లమ్ ఇప్పుడు స్టార్ట్ అయిందని అనుపమ కోపంగా ఫోన్ కట్ చేస్తుంది. అసలు ఈ అనుపమ మనుల మధ్య సంబంధం ఏంటో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |